calender_icon.png 9 May, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను.. మనోభావాలు దెబ్బతింటే క్షమించండి..

09-05-2025 01:39:11 AM

కరీంనగర్, మే 8 (విజయ క్రాంతి): ఆపరేషన్ సిందూర్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని ఎస్ యు ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత ఒక ప్రకటనలో తెలిపారు.

తాను పేస్ బుక్ లో పెట్టిన కామెంట్ ని అనేక విధాలుగా వైరల్ కావడం చూసి భాధపడుతున్నానని పేర్కొన్నారు. తాను వృత్తి రీత్యా ఒక ప్రొఫెసర్ను, సామజిక బాధ్యతతో నేటికీ అనేక సామాజిక కార్యక్రమాలు నా స్వంత డబ్బుతో   చేస్తున్నానని తెలిపారు.

ఒక పరిశోదకురాలుగా యుద్ధం అంటే భయంతో, అందులో మరణించే పసిపిల్లలు గుర్తులు వచ్చి పోస్ట్ చేశాను తప్పితే, దేశ భద్రత, సైన్యం, ప్రభుత్యంపై ఎటువంటి అగౌరవంతో కాదని, నేను భాధ్యత కలిగిన పౌరురాలినని, దేశం అంటే భక్తి ఉంది కాబట్టే స్పందించానని పేర్కొన్నారు.

నా కామెంట్స్ ఎవరిని, ఏ మతాన్ని, సందర్భాన్ని కించపరిచెవి కావని, ఎవరైనా భాధపడినా, మనోభావాలు దెబ్బతిన్నా క్షమించాల్సిందిగా  వేడుకొంటున్నానని పేర్కొన్నారు.