calender_icon.png 9 May, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ త్వరలో ప్రారంభిస్తాం

09-05-2025 01:38:11 AM

ఎమ్మెల్యే మురళి నాయక్ 

మహబూబాబాద్, మే 8 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ తెలిపారు. గురువారం మార్కెట్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.

పక్కన ప్రజలకు కూరగాయలు, పండ్లు, మాంసాహారం, చేపలు, నిత్యవసర వస్తువులన్నీ ఒకే చోట అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పనులను వేగవంతంగా నిర్వహించి, ట్రాఫిక్ సమస్య లేకుండా అన్నివైపులా రోడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.