13-08-2025 12:00:00 AM
అశ్వరావుపేట, ఆగస్టు 12 (విజయ క్రాంతి):అశ్వారావుపేట నియోజకవర్గం లో విద్యార్థుల చదువుల పట్ల ఆసక్తి పెం పొందించేందుకు భవిష్యత్తు పట్ల స్పష్టమైన దిశా నిర్దేశం చూపించేందుకు ‘ఇన్ స్పురై & ఇగ్నైట్’ కార్యక్రమాన్ని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్య అనేది పుస్తకాలకు పరిమితం కాకుండా ఉన్నత శిఖరాలకు ఆదరించేందుకు ఉపయోగపడుతుందన్నారు.
ఈ కార్యక్రమం కోసం హైదరాబాదు నుండి ప్రత్యేకమైన మోటివేషన్ స్పీకర్లను పిలిపించారు. అశ్వారావుపేట ముస్లిం మైనారిటీ బాలికల పాఠశాల ఏజీహెచ్‌ఎస్ ,బాలికల పాఠశాల మద్దికొండ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ కార్యక్రమాలు చేపట్టారు .ఇన్ స్పురై మైండ్స్ ఇగ్నైటింగ్ సోల్స్ సభ్యులు విద్యార్థులలో ఆత్మవిశ్వాసం లక్ష్యసాధన భవిష్యత్తు ప్రణాళిక వంటి అంశాలపై చక్కని అవగాహన కల్పించారు .
ఈ కార్యక్రమానికి స్ఫూర్తి సహకారం అందించిన సంస్థ వ్యవస్థాపకులు శ్రీ లక్ష్మారెడ్డి కి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీడీఏ పీవో బి. రాహుల్ , మోటివేషన్ స్పీకర్స్ జైపాల్ ,రంజిత్ , సుధాకర్ , రామ్, శ్రవణ్, అయ్యప్ప, సురేంద్ర, నవీన్ గారు, ఖాసీం, మండల విద్యాశాఖ అధికారి ప్రసాద్ రావు ,స్థానిక అధికారులు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.