calender_icon.png 16 August, 2025 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి

13-08-2025 12:00:00 AM

కోరుట్ల.ఆగస్టు12.(విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం మండల ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశం లో మండల విద్యాధికారి బండారి మధు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన వి ద్యను అందించాలని మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులతో ఎంఈఓ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రధాన ఉపాధ్యాయులు పాఠశాల స్థాయి ప్రణాళికలు రూపొందించుకొని వాటిని అమలు చేస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలన్నారు.

వెనుకబడ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వారిని అన్ని రంగాల్లో ముందుకు వచ్చే విధంగా కృషి చేయాలి అన్నారు. విద్యార్థుల యొక్క ప్ర గతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలన్నారు . ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమా న్ని ప్రతి ఒక్క పాఠశాలలో అమలు జరిగేలా చూడాలన్నారు.పాఠశాలల యొక్క అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తదితరులుపాల్గొన్నారు.