05-09-2025 12:00:00 AM
‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనుజ్, ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్‌లో నటిస్తున్న తాజాచిత్రం ‘లిటిల్ హార్ట్స్’. దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. డైరెక్టర్ ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మూవీ హైలైట్స్ తెలిపాడు హీరో మౌళి తనుజ్.
నేను రైటర్, డైరెక్టర్ అవుదామనే ఇండస్ట్రీకి వచ్చాను. చదువుకునే రోజుల్లో ఎడిటింగ్ నేర్చుకున్నా. బీటెక్ చదువుతూనే షార్ట్ ఫిలింస్ చేసేవాళ్లం. ఆ తర్వాత సోషల్ మీడియా కంటెంట్ చేస్తూ మా షార్ట్ ఫిలింస్‌ను ప్రమోట్ చేసుకున్నాం. ఈ ప్రాసెస్‌లో స్క్రిప్ట్స్ మీద అవగాహన తెచ్చుకున్నా. ఇండస్ట్రీకి వచ్చాక నటుడిగా అవకాశం వచ్చింది.
ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు అన్ని ఏజ్ గ్రూప్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ‘లిటిల్ హార్ట్స్’ ఉంటుంది. ఒక్క యూత్ కోసమే చేసిన సినిమా కాదు. థియేటర్లలో సినిమా సస్టెయిన్ అవ్వాలంటే యూత్‌తో పాటు మిగతా అందరు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉండాలి. ఈ సినిమాలో అలాంటి కంటెంట్ ఉంది.
వీలైనన్ని మంచి చిత్రాల్లో నటించాలని ఉంది. ఓ పదేళ్ల తర్వాత నేను ఎన్ని సినిమాలు చేశాననేది ఎవరికీ గుర్తుండదు కానీ, నేను చేసిన మంచి చిత్రాలు మాత్రం గుర్తుపెట్టుకుంటారు. అలాగే నేను రైటర్, డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన డ్రీమ్ కూడా ఫ్యూచర్‌లో నెరవేర్చుకుంటా.
స్క్రిప్ట్ వర్క్ కూడా చేస్తున్నా. ఇప్పుడు నటుడిగా అవకాశాలు వస్తున్నాయి కాబట్టి నటిస్తుంటా. మా కుటుంబంలో ఎవరికీ సినిమా ఇండస్ట్రీతో పరిచయాలు లేవు. నేను కూడా ఇక్కడ స్థిరపడగలనని మా ఫ్యామిలీ వారికి నమ్మకం లేకుండేది. ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ తర్వాత వారికి కొంత నమ్మకం ఏర్పడింది.
సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేసేప్పటి నుంచే విమర్శలు అలవాటు అయ్యాయి. కొందరికి మా సినిమా నచ్చకపోవచ్చు. వారు ఏదైనా విమర్శిస్తే పాజిటివ్‌గా తీసుకుంటా. ఏదైనా లోపం ఉంటేనే విమర్శిస్తారు. ఆ లోపాన్ని సరిచేసుకుంటే ఎదుగుతామని నమ్ముతా.
అమ్మానాన్నలతో కలిసి చూసే సినిమాలే చేయాలనుకుంటున్నా. మా పేరెంట్స్‌తో నేను కలిసి కంఫర్ట్‌గా మూవీ చూడాలి. సినిమా చూశాక వాళ్లు మంచి సినిమా చేశావని చెప్పాలి. నేను రాసే స్క్రిప్ట్స్ కూడా అలాగే ఉంటాయి. సోషల్ మీడియా కంటెంట్ కూడా అందరికీ నచ్చేలా చేశాను.