calender_icon.png 8 September, 2025 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూనిఫామ్ వేసుకున్న తర్వాత అందరూ ఫ్యామిలీనే

05-09-2025 12:00:00 AM

అథర్వా మురళీ నటించిన యాక్ష న్ -ప్యాక్డ్ థ్రిల్లర్ చిత్రం ‘టన్నెల్’. రవీంద్ర మాధవ దర్శకత్వం వహించిన ఈ సిని మాలో లావణ్య త్రిపాఠి కథా నాయిక. అశ్విన్ కాకుమాను విల న్‌గా కనిపించనున్నారు. సెప్టెం బర్ 12న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని తెలుగులోకి ఏ రాజు నాయక్ లచ్చురామ్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదలవు తోంది.

తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో ‘యూనిఫామ్ వేసుకున్న తర్వాత అందరూ ఫ్యామిలీనే’ అంటూ హీరో చెప్పిన డైలాగ్ ఆకట్టుకుం టోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి శక్తి శరవణన్ సినిమాటోగ్రాఫర్‌గా, కలైవానన్ ఎడిటర్‌గా పనిచేశారు.