calender_icon.png 18 May, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మ్యాన్ హోళ్లలో బ్లాంకెట్లు.. బెడ్ షీట్లు!

17-05-2025 01:12:25 AM

-స్పెషల్ డ్రైవ్‌లో డీ-సిల్టింగ్ నిర్వహించిన వ్యర్థాలు వేయడమే కారణం

-అవగాహన కల్పించినా మారని తీరు

-మ్యాన్ హోళ్లలో ఘన పదార్థాలు, వ్యర్థాలను వేస్తున్న ప్రజలు

మలక్‌పేట్, మే 16 (విజయక్రాంతి): జలమండలి ఓ అండ్ ఎం డివిజన్ నం-2 రియాసత్ నగర్ పరిధిలోని మలక్ పేట్, నల్గొండ చౌరస్తా లో సీవరేజ్ ఓవర్ ఫ్లో ను అధికారులు అరికట్టారు. జెట్టింగ్ యంత్రా న్ని ఉపయోగించి సిల్ట్‌ను బయటికి తీసి మురుగు నీటి ప్రవాహానికి ఆటంకం లేకుం డా చేశారు.

ఈ ప్రాంతాల్లో తరుచూ సీవరేజ్ ఓవర్ ఫ్లో ఫిర్యాదులు నమోదు కావడంతో అధికారులు డీ- సిల్టింగ్ పను చేపట్టారు.. అయితే మ్యాన్ హోళ్లలో నుంచి బ్లాంకెట్లు.. బెడ్ షీట్లు, బట్టలు, ప్లాస్టిక్ వస్తువులు ఇతర ఘన పదార్థాలను గుర్తించారు. ఆ కారణంగా  ఆ ప్రాంతంలో సీవరేజ్ ఓవర్ ఫ్లో అవుతున్నట్టు గుర్తించారు. గత కొన్ని రోజుల క్రితం  స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఇక్కడ డీ-సిల్టింగ్ పనులు నిర్వహించి సిల్ట్ అంతా తొలగించారు. కానీ మళ్లీ అందులో వ్యర్థాలు వేయడం వల్ల అది పేరుకుపోయి మళ్లీ ఓవ ర్ ఫ్లో అయింది.

ప్రజల అవగాహన లేమితో ఇలా చేయడం వల్ల సమస్య మళ్లీ ఉత్పనమవుతుందని అధికారులు తెలిపారు. జనాల్లో అవగాహన, వారి నుంచి సరైన సహకారం లేకుంటే ఇలాంటి స్పెషల్ డ్రైవ్ లు ఎన్ని చేపట్టినా సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇక నుంచి ఎవరైనా మ్యాన్ హోళ్లలో చెత్త, వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.