calender_icon.png 23 July, 2025 | 1:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగిత్యాల ప్రజల రుణం తీర్చుకుంటా

23-07-2025 12:00:00 AM

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జగిత్యాల అర్బన్ జూలై 22(విజయక్రాంతి): జగిత్యాల నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామంలో రు. 1కోటి 80 లక్షలు, చర్లపల్లి గ్రామంలో రు.15 లక్షలు ,మోరపల్లి గ్రామంలో రు.45 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి, జగిత్యాల అర్బన్ మండలం అంబర్ పేట్ గ్రామంలో రు.25 లక్షల నిధులతో, హస్నాబాద్ గ్రామంలో రు.30 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మంగళవారం భూ మిపూజ చేశారు.

హస్నాబాద్ గ్రామంలో రు.20 లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనంతరం గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇం టి నిర్మాణ పనులను పరిశీలించి,లబ్ధిదారులతో మాట్లాడి పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగాఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల పట్టణం తో పాటు గ్రామాలను సమానంగా అభివృద్ధి చేస్తానన్నారు.

అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామ ని,పేద ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డులు పంపిణీ చేయటం జరిగిందన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం తో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేసి ప్రజ ల రుణం తీర్చుకుంటానన్నారు.మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయటానికి ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.

ఒకే విడతలో రు.24 వేల కోట్ల రుణ మాఫీ దేశంలోనే ఎక్కడా జరగలేదన్నారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ లు రామ్మోహన్,శ్రీనివాస్, ఎంపీ డీవోలు విజయ లక్ష్మీ,రమాదేవి, ఎంపీ ఓలు వాసవి, రవి బాబు, డి ఈ మిలింద్ నాయకులునక్కల రవీందర్ రెడ్డి,బాల ముకుందం,మహేశ్వర్ రావు,నారాయణ రెడ్డి,రాజేశ్వర్ రెడ్డి, దుమల రాజ్ కుమార్,కట్ట రాజేందర్ తదితరులుపాల్గొన్నారు.