calender_icon.png 12 October, 2025 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఆర్‌యూకు ప్రపంచ స్థాయి గుర్తింపు

12-10-2025 01:49:45 AM

ద వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ చోటు

వరంగల్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా ఎస్‌ఆర్ యూనివర్సిటీ ప్రపంచ ప్రఖ్యాత టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ద వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 801 బ్యాండ్‌లో స్థానం సంపాదించింది. ఇది ఎస్‌ఆర్ యూనివర్సిటీకి తొలి అంతర్జాతీయ ర్యాంకింగ్ విజయంగా నిలిచింది. భారతదేశంలోనే అనతికాలంలో ఈ గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కిన విశ్వవిద్యాలయంగా ఎస్‌ఆర్‌యూ గుర్తింపు పొందింది.

ఇటీవల వెలువడిన ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్‌లో కూడా ఎస్‌ఆర్ యూనివర్సిటీ ఇంజినీ రింగ్ విభాగంలో 91వ స్థానం, విశ్వవిద్యాలయ విభాగంలో 101 150 బ్యాండ్‌లో నిలిచింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయ ప్రదర్శనను అంచనా వేయడానికి అత్యంత విశ్వసనీయమైన ప్రమా ణాలుగా పరిగణించబడతాయి.

బోధన, పరిశోధన, సైటేషన్స్, అంతర్జాతీయ దృష్టికోణం, ఇండ స్టీ ఇన్కమ్ వంటి ఐదు ప్రధాన విభాగాల ఆధారంగా 17 సూచికల ద్వారా ఈ ర్యాంకిం గ్స్ ప్రకటించబడతాయి. 2026 ఎడిషన్ జెడ్డా, సౌదీ అరేబియాలో జరిగిన వరల్డ్ అకడమిక్ సమ్మిట్‌లో విడుదలైంది. అమెరికా తర్వాత అత్యధిక విశ్వ విద్యాలయాలు ర్యాంక్ పొందిన దేశంగా భారత్ రెండో స్థానంలో నిలిచింది.

ఈ జాబితాలో ఎస్.ఆర్. యూనివర్సిటీ భారతదే శంలో టాప్ 28, ప్రైవేట్ విశ్వవిద్యాలయా ల్లో 10వ స్థానం, అలాగే తెలంగాణలో టాప్ 1000లో చోటు దక్కిన ఏకైక ప్రైవేట్ యూనివర్సిటీగా నిలిచింది. ఎస్‌ఆర్ యూ నివర్సిటీ చాన్సలర్ ఏ వరదరెడ్డి మాట్లాడుతూ.. ఎస్‌ఆర్‌యూ ఎల్లప్పు డూ బోధన, అభ్యాసంలో అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తుంది.

విద్యార్థులను పరిశ్రమ కు తగిన నైపుణ్యాలతో తీర్చిదిద్దడం, అధ్యాపకుల నాణ్యతపై దృష్టి పెట్టడం మా ప్రధాన లక్ష్యం అన్నారు. వైస్ చాన్సలర్ ప్రొ. దీపక్‌గార్గ్ మాట్లాడుతూ, ఈ ర్యాంకింగ్ ఎస్‌ఆర్ యూ బలమైన విద్యా ప్రాతిపదిక, అంతర్జాతీయ దృష్టికోణానికి నిదర్శనం అన్నారు. ప్రొ. వి. మహేష్ (ప్రో వైస్ చాన్సలర్), ప్రొ. పి.వి. రమణరావు (రిజిస్ట్రార్), ప్రొ. ఆర్. అర్చనారెడ్డి (డీన్ గ్రోత్, ఆపరేషన్స్), ప్రొ. పి.వి. రాజశేఖర్ (డైరెక్టర్ ఐక్యూఏసీసమావేశంలో పాల్గొన్నారు.