27-11-2025 12:00:00 AM
- కెసిఆర్ హయాంలో అభివృద్ధి అయిన వాటికే రంగులు వేసి ప్రచారం చేసుకుంటున్నారు...
- వేములవాడ రాజన్న క్షేత్రం.. అభివృద్ధి పేరిట నిర్వాసితులు నష్టపోతున్నారు.
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 26 (విజయక్రాంతి): వేములవాడ పట్టణ భారత రాష్ట్ర సమితి కెసిఆర్ సారధ్యంలో గత పది ఏళ్ల పాలనలో ఎంతో అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ వచ్చిన రెండేళ్లలో మాత్రం కూల్చ డం, ఎగబెట్టడం, కుంగడం ఇలా చెప్పుకుంటూ పోతే వారి హయాంలోనే ఇవన్నీ జ రుగుతున్నాయనీ వేములవాడ బిఆర్‌ఎస్ పట్టణ శాఖ ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశం. ఈ సందర్భంగా మాజీ సెస్ డైరెక్టర్, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు రామ తీర్థపు రాజు, నిమ్మశెట్టి విజయ్, నీలం శేఖర్, మారం కుమార్ మాట్లాడుతూ.
కెసిఆర్ హయాంలో జరిగిన అభివృద్ధికి రంగులు వే సి కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. వేములవాడ ము న్సిపల్ పరిధిలోని 6వ వార్డులో పేదల కో సం గత ప్రభుత్వంలో బస్ డిపో వద్ద డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం కోసం ప్రభుత్వ భూ మిని సేకరించి దాదాపు 144 మందికి డబు ల్ బెడ్ రూమ్ ఇస్తామని ప్రణాళిక సిద్ధం చేసి పునాది నుండి స్లాబ్ వరకు నిర్మించినతరుణంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.
ఈనాడు వాటికి ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టి పేదలకు ఇస్తామని కేవలం వాళ్లకు నచ్చిన వాళ్లకే 144 మంది లిస్ట్ లో పేరు చూపించి. స్థలాలు లేని దాదాపు 1500ల మంది లబ్ధిదారులకు మొండి చేయి చూపించారు. అర్హత గల నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నా రు. నిన్నటి రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా అధికారులతో కలిసి పేదలకు ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ నిర్మాణాలను పరిశీలించడానికి వెళ్లారు. కానీ అక్కడ అధికారుల వైఫల్యమో.
సమన్వయ లోప ము తెలియదు కానీ. ఒకేసారి చాలామంది ఇంకా అసంపూర్తిగా గత రెండు సంవత్సరాల నుండి ఎలాంటి మరమ్మత్తుపనులు చే యక, రాగడి నేల కావడంతో పూర్తికాని ఫ్లో రింగ్ మీద నిలబడడంతో కూలిపోయింది. దీనిపై ఆర్‌అండ్ బి డిఈ భద్రయ్య నిన్నటి రోజున వివరణ కూడా మీడియాలో ఇచ్చా రు. డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం జరిగినప్పుడు కేవలం ఫ్లోరింగ్ సిమెంటు, కాంక్రీటు కలుపుకోవడానికి మాత్రమే నామమాత్రం గా వేసామని తెలిపారు. పూర్తిస్థాయిలో ఫ్లో రింగ్ నిర్మాణం కాలేదని వారే స్పష్టంగా చెప్పారు.
కూలితే కేసీఆర్ పేరు. లేదంటే కాలేశ్వరం పేరు తీయడం కాంగ్రెస్ వాళ్లకు అల వాటైపోయింది. మీకు ధైర్యం ఉంటే. అధికారులతో విచారణ చేపట్టి నాణ్యత లోపించి నట్లయితే పునాది నుండి మొదలుపెట్టి.పూర్తి చేసి అర్హులకు ఇందిరమ్మ పేరు పెట్టి ఇల్లు ఇ వ్వండి మేము కూడా అభివృద్ధినీ స్వాగతి స్తాం. మరొకసారి చెబుతున్నాం మళ్లీ కేసీఆర్ పేరు పెట్టి కాలేశ్వరం పేరు పెట్టి. ఆరోప ణలు చేసినట్లయితే సహించబోమని మీడి యా ద్వారా హెచ్చరిస్తున్నాం.ఈ సమావేశంలో పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతి కు మార్, మాజీ కౌన్సిలర్లు జోగిని శంకర్, ముద్రకోల వెంకన్న, నాయకులు వాసాలా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.