27-11-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 26 (విజయక్రాంతి): రెసోనెన్స్ కన్సల్టెన్సీ-ఇప్సోస్ సంస్థ ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో నిర్వహించిన సర్వే నివేదిక ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ నగరాల జాబితాను విడుదల చేసింది. అందు లో హైదరాబాద్ నగరానికి 82వ స్థానం దక్కడం గమనార్హం. క్యాపిటల్స్ ఆఫ్ క్యాపిటల్‌గా పిలువబడే లండన్ నగరం వరుసగా 11వ సారి మొదటి స్థానంలో నిలిచింది.
ఆ తర్వాత వరుసగా రెండు నుంచి 8 వరకు స్థానాలను న్యూ యార్క్, ప్యారిస్, టోక్యో, మాడ్రిడ్, సింగపూర్, రోమ్, బెర్లిన్ దక్కించుకున్నాయి. ఇక భారతదేశానికి చెందిన నాలుగు నగరాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అందులో బెంగళూరు 29వ స్థానంలో నిలిచింది. టెక్ ఎకోసిస్టం, కార్పొరేట్ బేస్ వల్ల బెంగళూరు నగరానికి ఈ గుర్తింపు దక్కిందని చెప్పవచ్చు. ఇక ముంబై 40వ స్థానంలో నిలిచింది.
ఈ నగరంలో ఉద్యోగాలు, సాంస్కృతిక కార్యకలా పాలు, ఇన్నోవే షన్ కేంద్రంగా ప్రాధాన్యం పెరుగుతోందని సర్వే నివేదకలో వెల్లడించారు. రాజకీయ ప్రభావం, రవాణా అనుసంధానం, అభివృద్ధి చెందుతున్న ఇన్ఫ్రాస్ట్ర క్చర్ ఆధారంగా దేశ రాజధాని ఢిల్లీ 54వ ర్యాంక్‌ను సాధించింది. ఆ తర్వాత టెక్నాలజీ విస్తరణ, ఐటీ సేవల కేంద్రంగా ఎదుగుతున్న కారణంగా హైదరాబాద్ నగరం 82వ ర్యాంకును సాధించిందని నివేదిక తెలిపింది.
ఇలా ఎంపిక చేశారు
రెసోనెన్స్ కన్సల్టెన్సీ ఇప్సోస్ సంస్థ ప్రపంచ అత్యుత్తమ నగరాల జాబితా తయారీకి ప్రధానంగా 34 అంశాలను పరిగణలోకి తీసుకున్నది. వాటిలో ముఖ్యంగా నివాసయోగ్యమైన, ప్రేమించదగిన, ప్రజా శ్రేయ స్సు ఆధారంగా ఎంపిక చేశారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొత్తం 276 నగరాల జాబితాను తయారు చేశారు.