19 April, 2026 | 8:47 AM

కేటీఆర్ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే

19-06-2025 01:23 AM

ఫిషర్‌మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ 

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి):  తెలంగాణ పరువును బజారులో పడేసిన కల్వకుంట్ల కుటుంబానికి నోటీసులు ఇవ్వాలని ఫిషర్‌మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ విమర్శించారు. ఫోన్ ట్యా పింగ్ ద్వారా భార్యభర్తల సంభాషణలు వినడానికి సిగ్గుండాలని ఆయన మండిపడ్డారు.

బుధవారం మెట్టు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలేనని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఒక అరగంటసేపు ఆలోచిస్తే.. ఆ పార్టీలో ఒక్కరు మిగలరని, బీఆర్‌ఎస్ అనేది ఇక గతమని చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు. కేటీఆర్‌కు ఇంగ్లిష్ పుల్ అని, సబ్జెక్టు మాత్రం నిల్ అని విమర్శించారు. ఇప్పటివరకు సీఎం రేవంత్‌రెడ్డి పేరును కేసీఆర్ కుటుంబం కోటిసార్లు పలికి ఉంటారని విమర్శించారు.