calender_icon.png 28 November, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినిమా బాగుంటే భాష సరిహద్దులుండవ్

28-11-2025 12:35:56 AM

అవినాశ్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయ మవుతున్న సినిమా ‘వానర’. ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. నందు ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. సిల్వర్‌స్క్రీన్ సినిమాస్ బ్యానర్‌పై అవినాశ్ బుయానీ, ఆలపాటి రాజా, సీ అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు.

మైథలాజికల్ రూరల్ డ్రామాగా రూపొం దుతున్న ఈ సినిమా టీజర్‌ను నటుడు మంచు మనోజ్ గురువారం విడుదల చేశారు. అంనతరం ఆయన మాట్లాడుతూ.. “బాగున్న ప్రతి సినిమా భాషలకు అతీతంగా ఇండియన్ సినిమా అయ్యింది. ఈ సినిమా సక్సెస్ కావాలి” అన్నారు. ‘వానరుడి లాంటి హీరో తనకు ఇష్టమైన బైక్‌ను రావణుడి లాంటి విలన్ తీసుకెళ్లిపోతే ఆ బైక్‌ను తిరిగి తెచ్చుకునేందుకు ఎంతవరకు వెళ్లాడనేది ఈ చిత్ర కథాంశం” అని హీరో, దర్శకుడు అవినాశ్ చెప్పారు. డైరెక్టర్ జానకీరామ్, చిత్రబృందం పాల్గొన్నారు.