calender_icon.png 28 November, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీనివాస మంగాపురంతో పరిచయం

28-11-2025 12:37:16 AM

సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేశ్‌బాబు కుమారుడు, సూపర్ స్టార్ మహేశ్‌బాబు అన్న కొడుకు, జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ‘ఆర్‌ఎక్స్100’, ‘మంగళవారం’ వంటి చిత్రాలను అందించిన అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ ఘట్టమనేని వారసుడు అరంగేట్రం చేయబోతున్నాడు. వైజయంతి మూవీస్ అశ్వినిదత్ సమర్పిస్తున్న ఈ సినిమాను చందమామ కథలు బ్యానర్‌పై పీ కిరణ్ నిర్మిస్తున్నారు.

టైమ్‌లెస్ కల్ట్ ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ గురువారం ప్రకటించారు. ప్రీ-లుక్ పోస్టర్‌ను సైతం విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్ ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. బాలీవుడ్ యువ కథానాయకి రాషా తడాని ఈ సినిమాలో జయకృష్ణతో జోడీ కట్టునుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.