calender_icon.png 28 November, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంగ్లీపై అసభ్య కామెంట్స్

28-11-2025 12:00:00 AM

  1. ఎస్‌ఆర్‌నగర్‌లో మంగ్లీ ఫిర్యాదు
  2. పోలీసుల అదుపులో నిందితుడు

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 27 (విజయక్రాంతి): ప్రముఖ గాయని మంగ్లీపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్య లు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మంగ్లీ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ఎస్‌ఆర్ నగర్ పోలీసులు.. మేడిపల్లి స్టార్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల మంగ్లీ పాడి న ‘బాయిలోనే బల్లి పలికే’ పాట యూట్యూబ్‌లో విడుదలై విశేష ఆదరణ పొందుతోం ది.

ఈ పాటను ఉద్దేశించి మంగ్లీపై మేడిపల్లి స్టార్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో అత్యం త జుగుప్సాకరమైన కామెంట్స్ చేశాడు. మంగ్లీ సామాజిక వర్గాన్ని కించపరిచేలా, ఆమెను దూషిస్తూ వీడియోలు పోస్ట్ చేశా డు. తీవ్ర మనస్తాపానికి గురైన మంగ్లీ.. ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశా రు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతికత సాయంతో నిందితుడు మేడిపల్లి స్టార్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నట్లు సమాచారం. కాగా బాయిలోనే బల్లి పలికే పాట సంగీత ప్రియులను ఊపేస్తోంది. కమల్ ఎస్లావత్ సాహిత్యం, సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ పాటలో మంగ్లీతో పాటు పాపులర్ ఆర్టిస్ట్ నాగవ్వ కూడా గొం తు కలిపారు. విడుదలై కేవలం 5 రోజులే అయిన ప్పటికీ.. ఇప్పటికే ఈ పాట 8 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది.