calender_icon.png 23 November, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్నులపై మన్ను కప్పితే.. గన్ను లై మొలకెత్తుతాయ్

23-11-2025 12:10:05 AM

  1. అందెశ్రీ నినాదాన్ని నిజం చేసిన పోరాట గడ్డ ఇది
  2. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులదే కీలక పాత్ర 
  3. రవీంద్రభారతిలో అందెశ్రీ సంతాప సభలో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, సిటీ బ్యూరో నవంబర్ 22 (విజయక్రాంతి): ‘కవి రాసే పెన్నుల మీద మన్ను కప్పితే.. అవి గన్నులై మొలకెత్తుతా య్.. మీ గడీలను కుప్పకూలుస్తాయ్’ అన్న నినాదాన్ని అందెశ్రీ నిజం చేశారు. తెలంగాణ ప్రజలు అమాయకంగా కనిపిస్తారు కానీ అమాయకులు కాదు. ఈ గడ్డ మీద పుట్టిన ఎవరూ ఆధిపత్యాన్ని, అహంకారాన్ని సహించరు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో శనివారం నిర్వహించిన ప్రజాకవి డాక్టరు అందెశ్రీ సంతాప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారులు పోషించిన పాత్రను, అందెశ్రీ సేవలను ఆ యన కొనియాడారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నడూ బడికి వెళ్లని అందె శ్రీ ‘జయజయహే తెలంగాణ’ వంటి అద్భుతమైన గీతాన్ని అందించారు.

ఉద్యమ సమ యంలో ఆయన పాట లేకుండా ఒక్క సభ కూడా జరగలేదు. కానీ, తెలంగాణ సాకారమైన తర్వాత ఆ పాటను పాలకుల దృష్టిలో పదేళ్లు మూగబోయేలా చేశారు. కొందరు కుట్రపూరితంగా ఉద్యమంలో ఆయన పా త్రను కనుమరుగు చేసే ప్రయత్నం చేశారు. కానీ, ప్రజల గుండెల్లో ఆ పాట నిత్యం గాన మై నిలిచింది అని గుర్తుచేశారు.

ప్రజాప్రభుత్వం అండగా ఉంటుంది

 అందెశ్రీ, గద్దర్ వంటి వారు తెలంగాణకు రెండు కళ్ల లాంటి వారన్న సీఎం, వారి కుటుంబాలకు ప్రజాప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే ‘జయ జయ హే తెలంగాణ’ను రాష్ర్ట గీతంగా ప్రకటించడమే కాకుండా, ప్రతి బడిలో పాడాలని, పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కవులు, కళాకారులు, దళితు లను ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చా రు. ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ర్టం తెలంగాణేనని గుర్తుచేశారు.

విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో ఎస్సీల ప్రాతినిథ్యం పెరగాలని, అందుకు అనుగుణంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఎన్ని వజ్రాలు ఉన్నా కోహినూరు వజ్రం ఎలాగో.. ఎందరు కవులు ఉన్నా అం దెశ్రీ ప్రత్యేకమన్నారు. రాబోయే రోజుల్లో ఆయన గురించి కోహినూర్ వజ్రంలా చర్చ జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, టీపీసీసీ అధ్యక్షుడు మ హేశ్ కుమార్‌గౌడ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, టీజేఎస్ చీఫ్ కోదండరాం, మాజీ ఎంపీ వి.హనుమంత రావు పాల్గొన్నారు.