calender_icon.png 23 November, 2025 | 1:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.6 లక్షలకు శిశువు విక్రయం!

23-11-2025 12:00:00 AM

కరీంనగర్ జిల్లాలో ఘటన

కరీంనగర్ క్రైం, నవంబర్ 22 (విజయక్రాంతి): నెల నిండని శిశువును రూ.6 లక్షలకు విక్రయించిన సంఘటన కరీంనగర్‌లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని ప్రేమించి గర్భందాల్చిన యువతి హైదరాబాద్‌లోని ఓ ప్రైవే ట్ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రియుడు మోసం చేయడంతో బిడ్డను ఎలా పోషించాలో తెలియక అమ్మకానికి పెట్టింది. రూ.6 లక్షలకు శిశువును విక్రయించేందుకు బేరం కుదుర్చుకుని కరీంనగర్‌లో బిడ్డను విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

నిందితురాలు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళగా గుర్తించామని, శిశువును కొన్నవారు గన్నేరువరం మండలవా సులుగా గుర్తించామని టుటౌన్ సీఐ సృజన్‌రెడ్డి తెలిపారు. పోలీసులు 15 మందిని అరెస్టు చేసి, శిశువును వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.