calender_icon.png 23 November, 2025 | 12:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హత్యకు మాజీ సైనికుడి సుపారీ

23-11-2025 12:36:57 AM

  1. పథకం విఫలం.. అరెస్ట్

సిద్దిపేట జిల్లాలో ఘటన

సిద్దిపేట క్రైం, నవంబర్ 22: ఓ మాజీ సైనికుడు ఆస్తి విషయంలో ఒకరి ప్రాణాలు తీసేందుకు యత్నించి, పథకం బెడిసి కొట్టడంతో కటకటాల పాలయ్యాడు. సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన పుల్లగుర్ల శ్రీనివాస్‌రెడ్డి అలియా స్ పోలీస్ శ్రీనివాస్‌రెడ్డి(మాజీ సైనికుడు), పులిగుర్ల ఎల్లారెడ్డి మధ్య కొంతకాలంగా దారి విషయంలో భూ వివాదాలు కొనసాగుతు న్నాయి.

ఎన్నోసార్లు పంచాయితీలు జరిగినప్పటికీ ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. దాంతో కక్ష పెంచుకున్న శ్రీనివాసరెడ్డి.. ఎల్లారెడ్డిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని తన బంధువులు సాగర్, అతని స్నేహితుడు భరత్‌కు చెప్పగా, వారు ఇర్కోడుకు చెందిన పరశురాములును పరిచయం చేశారు. ఎల్లారెడ్డిని హత్య చేసేందు కు పరశురాములుతో రూ.10 లక్షలు బేరం కుదుర్చుకున్నారు.

అందులో సగం రూ.ఐ దు లక్షలను విడతల వారీగా శ్రీనివాసరెడ్డి ముట్టజెప్పాడు. హత్య చేయడానికి పరశురాములు తనకు పరిచయస్థుడైన ఫాజిల్‌ను కలిశాడు. ఫాజిల్ ద్వారా పరశురాములుకు పాత నేరస్థుడు కాస స్వామి పరిచయం అయ్యాడు. ఎల్లారెడ్డిని హత్య చేసేందుకు సహకరిస్తే స్వామికి రూ.3లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుని, రూ.2 లక్షలు ఇచ్చాడు. హత్య కోసం డ్రైవర్లున చెంది అనిల్, అంజిబాబు, దుర్గాప్రసాద్, మల్లికార్జున్ కలుపుకున్నాడు.

వారికీ ముందస్తుగా డబ్బులు చెల్లించాడు. ప్రదీప్ అనే వ్యక్తి వద్ద షిఫ్ట్ కారును అద్దెకు తెప్పించారు. పథకంలో భాగంగా అక్టోబర్ 22న రాత్రి బైకుపై వెళ్తున్న ఎల్లారెడ్డిని వెనుక నుంచి కారుతో ఢీ కొట్టారు. ఎల్లారెడ్డి స్వల్ప గాయాలతో బతికి బయటపడ్డాడు. ఈ విషయమై అప్పట్లో కేసు నమోదయింది. నిందితులు తర్వాత కారును అంజిబాబు ఇంట్లో దాచారు.

శనివారం ఉదయం పరశురాములు, స్వామి, ఫాజిల్, శ్రీనివాస్‌రెడ్డి కలిసి ఎల్లారెడ్డిని చంపేందుకు మరోసారి పథకం వేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 8 మొబైల్ ఫోన్స్, కార్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇరుకోడు గ్రామానికి చెందిన నిందితులు ఇద్దరు సాగర్, భరత్ పరారీలో ఉన్నారని ఏసీపీ రవీందర్‌రెడ్డి తెలిపారు.