23-11-2025 12:03:14 AM
గుట్టురట్టు చేసిన పోలీసులు
18 కోడి కత్తులు, 22 కోళ్లు స్వాధీనం
4 కార్లు, 13 సెల్‌ఫోన్లు సీజ్
మొయినాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఓ ఫామ్‌హౌస్‌లో కోడిపందేల నిర్వహణ గుట్టురట్టయింది. కోడి పందేలు ఆడుతున్న వారిని రాజేంద్రనగర్ పోలీసులు అరె స్టు చేశారు. మొయినాబాద్ మండల పరిధిలోని బాకారం గ్రామ శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా రాజమండ్రికి చెందిన నిర్వాహకుడు దాట్ల కృష్ణంరాజుతోపాటు మొత్తం 14 మంది కోడిపందాలు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు శనివారం దాడులు చేసి రూ.60,950 నగదు తోపాటు 4 కార్లు, 13 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. మొత్తం 22 కోళ్లు, 18 కోడి కత్తులను స్వాధీ నం చేసుకున్నారు.