23-11-2025 12:32:02 AM
హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో రెండు జిల్లాలకు మినహా మిగతా 31 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను ఏఐసీసీ ప్రకటించింది. మొత్తం 36 మంది డీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్ అధిష్ఠానం శనివారం నియమించింది. కొత్తవారికే ప్రాధా న్యం కల్పించింది. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ పరంగా 3 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను ప్రకటించింది. కరీంనగర్ జిల్లాకు, కరీంనగర్ కార్పొరేషన్, ఖమ్మం జిల్లాకు, ఖమ్మం కార్పొరేషన్, నిజామాబాద్, నిజామాబాద్ కార్పొరేషన్‌కు ఇద్దరి చొప్పున అధ్యక్షులను నియమించింది.
పలువురు ఎమ్మెల్యేలకు డీసీసీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. డీసీసీ అధ్యక్షుల నియామకంలో సామాజిక సమీకరణాలను అధిష్ఠానం పాటించింది. డీసీసీల్లో సగానికిపైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు. కానీ సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించకుండా కాంగ్రెస్ పార్టీ పెండింగ్ పెట్టింది.
జిల్లాపేరు డీసీసీ ప్రెసిడెంట్
ఆదిలాబాద్ డాక్టర్ నరేష్ జాదవ్
ఆసిఫాబాద్ ఆత్రం సుగుణ
భద్రాద్రి కొత్తగూడెం తోట దేవిప్రసన్న
యాదాద్రి భువనగిరి బీర్ల ఐలయ్య
గద్వాల ఎం రాజీవ్‌రెడ్డి
హనుమకొండ ఇంగాల వెంకట్ రాంరెడ్డి
హైదరాబాద్ సయ్యద్ ఖాలిద్ సైఫుల్లా
జగిత్యాల గాజెంగి నందయ్య
జనగామ లకావత్ ధన్వంతి
జయశంకర్ భూపాలపల్లి భట్టు కర్ణాకర్
కామారెడ్డి మల్లికార్జున్ ఆలె
కరీంనగర్ మేడిపల్లి సత్యం
కరీంనగర్ కార్పొరేషన్ వీ అంజన్‌కుమార్
ఖైరతాబాద్ మోత రోహిత్ ముదిరాజ్
ఖమ్మం నుతి సత్యనారాయణ
ఖమ్మం కార్పొరేషన్ దీపక్ చౌదరి
మహబూబాబాద్ భూక్య ఉమ
మహబూబ్‌నగర్ ఏ సంజీవ్ ముదిరాజ్
మంచిర్యాల పిన్నింటి రఘునాథ్‌రెడ్డి
మెదక్ శివనగరి ఆంజనేయులుగౌడ్
మేడ్చల్ తోటకూర వజ్రేష్ యాదవ్
ములుగు పైడాకుల అశోక్
నాగర్‌కర్నూల్ డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
నల్లగొండ పున్న కైలాశ్ నేత
నారాయణపేట కే ప్రశాంత్ కుమార్‌రెడ్డి
నిర్మల్ వెడ్మ బొజ్జు
నిజామాబాద్ కట్‌పల్లి నగేశ్‌రెడ్డి
నిజామాబాద్ కార్పొరేషన్ బొబ్బిలి రామకృష్ణ
పెద్దపల్లి ఎంఎస్ రాజ్‌ఠాకూర్
రాజన్న సిరిసిల్ల సంగీతం శ్రీనివాస్
సికింద్రాబాద్ కే దీపక్ జాన్
సిద్దిపేట తూంకుంట ఆంక్షరెడ్డి
సూర్యాపేట గుడిపాటి నర్సయ్య
వికారాబాద్ ధారాసింగ్ జాదవ్
వనపర్తి కే శివసేనరెడ్డి
వరంగల్ మహ్మద్ ఆయూబ్