calender_icon.png 23 November, 2025 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెక్ డ్యాం పేల్చివేత

23-11-2025 12:16:55 AM

మానేరులో ఇసుక తవ్వకాల కోసం మందుపాతర పెట్టి పేల్చిన ఇసుక మాఫియా?

పెద్దపల్లి జిల్లా గుంపుల మానేరు వాగుపై ఇటీవలే నిర్మాణం ప్రారంభోత్సవం కాకముందే ధంసం!

కరీంనగర్, నవంబర్ 21 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా పరిధిలోని ఓదెల మండలం గుంపుల మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాంను శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పేల్చివేశారు. మందుపాతర పెట్టి ఇసుక మాఫియా పేల్చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.19 కోట్ల వ్యయంతో మానేరులో నీటి ప్రవాహాన్ని అపి, సాగునీటి అవసరాలకు గత బీఆర్‌ఎస్ ప్రభు త్వ హయాంలో నిర్మాణ పనులు చేపట్ట గా.. ఇటీవలే పూర్తయ్యాయి.

చెక్ డ్యాం పనులు పూర్తి కావడంతో అధికారులు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు  చేస్తున్న సమయంలోనే ఇసుక మాఫియా ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీటిపారుదల శాఖ, పోలీస్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చెక్ డ్యాం తెగిపోవడంతో నీరు వృథాగా పోతున్నది. అయితే మానేరులో అక్రమంగా ఇసుక తవ్వకాల కో సమే చెక్‌డ్యామ్‌ను పేల్చివేసినట్లు గ్రామస్థు లు ఆరోపిస్తున్నారు.

దుండగులను గుర్తిం చి కఠినంగా శిక్షించాలని  డిమాండ్ చేస్తున్నా రు. కాగా పెద్దపెల్లి జిల్లాలోని ఇసుక రీచ్ ల లో గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో ఇసుక వెలికితీతలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో వాగులు, చెక్‌డ్యాముల వద్ద ఇ సుకను తరలించేందుకే ఇసుక మాఫియా ఈ  కూల్చివేతకు  పాల్పడినట్టు తెలుస్తున్నది.