calender_icon.png 13 May, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినిమా నచ్చకపోతే ప్రశ్నించండి

12-05-2025 01:49:12 AM

నవీన్‌చంద్ర హీరోగా వస్తున్న ద్విభాషా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘లెవెన్’. లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించారు. అజ్మల్‌ఖాన్, రేయా హరి నిర్మిసు ్తన్నారు.  మే 16న సినిమా విడుదల కానున్న సందర్భం గా మేకర్స్ తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథి హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు నవీన్‌కు ప్రతి అవకాశమూ ఆయన ప్రతిభను గుర్తిస్తూ వచ్చినవే.

ఈ సినిమా ఆయనకు మంచి విజయాన్నిస్తుందని కోరుకుంటున్నా’ అన్నారు. నవీన్‌చంద్ర మాట్లాడుతూ.. ‘మే 15న పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నాం. సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బు వెనక్కి అడిగే హక్కు మీకుంది. సమయం వృథా అయిందనిపించినా ప్రశ్నించే హక్కూ మీకుంది. ఈ సినిమాలో ఉన్న యూనిక్ కాన్సెప్ట్‌ను ఇప్పటివరకు మీరు ఏ థ్రిల్లర్‌లోనూ చూసుండరు’ అన్నారు. కార్యక్రమం లో చిత్రబృందం అందరూ పాల్గొన్నారు.