12-05-2025 01:50:38 AM
కంటెంట్ బేస్డ్ సినిమాలు, భారీ స్థాయిలో మాస్ ఎంటర్‌టైనర్లు రూపొందించడంలో ప్రత్యేకత చాటుతున్న పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరో కొత్త ప్రాజెక్టును ప్రకటించింది. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ సర్వైవల్ యాక్షన్ డ్రామాకు ఆర్‌ఎస్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఆదివారం సుధీర్‌బాబు పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో మెట్లపై కుప్పలుగా పడి ఉన్న మృతదేహాల మధ్య షర్ట్ లేకుండా, సాలిడ్ ఫిజిక్‌తో ఇంటెన్స్ లుక్‌లో కనిపించాడు సుధీర్‌బాబు. ఈ పోస్టర్‌లో రాసి ఉన్న ‘ఏ బ్రోకెన్ సోల్ ఆన్ ఏ బ్రూటల్ సెలబ్రేషన్’ అనే ట్యాగ్‌లైన్ సుధీర్‌బాబు క్యారెక్టర్ డెప్త్‌ని తెలియజేస్తోంది.