12-05-2025 01:46:42 AM
పహల్గాం ఘటనపై బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్ స్పం దించారు. ఈ ఎమోషనల్ పోస్ట్ నెటిజన్ల కళ్లు చెమర్చేలా చేస్తోం దిప్పుడు. “భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్లిన భర్తను ఉగ్ర మూక కాల్చి చంపింది. భర్తను చంపొద్దంటూ భార్య ఏడుస్తూ ఎంతగా వేడుకున్నా ఆ ఉన్మాది వినలేదు. ఆమె నుదిట సిందూరం లేకుండా చేశాడు. కళ్లముందే భర్త చనిపోవడాన్ని తట్టుకోలేని ఆమె ‘నన్ను కూడా చంపేయ్’ అంటూ మోకరిల్లింది.
అప్పుడు ఆ రాక్షసుడు.. ‘నిన్ను చంపను.. వెళ్లి, చెప్పుకో’ అంటూ పొగరు చూపించాడు. కూతురు లాంటి ఆమె మానసిక స్థితి చూస్తే.. ‘ఆమె వద్ద చితఃభస్మ ఉన్నా సిందూరం ఎక్కడని ప్రపంచం అడుగుతుంది’ అని నాన్న రాసిన పద్యంలోని పాదం గుర్తొచ్చింది. ‘అందుకే నేను సిందూరం ఇస్తున్నా.. ఆపరేషన్ సిందూర్’ జైహింద్. భారత సైన్యమా.. నువ్వు ఎప్పటికీ వెనకడుగు వేయవు. నీ ప్రయాణం ఎప్పటికీ ఆగదు” అని అమితాబ్ పేర్కొన్నారు.