calender_icon.png 13 August, 2025 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యంతాగి పట్టుబడితే చుక్కలే!

13-08-2025 01:01:47 AM

మేడ్చల్ అర్బన్, ఆగస్టు 12:మద్యం సే వించి వాహన తనిఖీల్లో పట్టుబడ్డ వాహనదారులకు చుక్కలు కనిపించేలా న్యాయమూ ర్తులు తీర్పులిస్తున్నారు. గతంలో మద్యం సేవించి వాహనం నడిపిన పలువురికి జైలు శిక్ష విధిస్తూ తీర్పునివ్వగా, తాజాగా మద్యం సేవించి ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన ఐదుగురికి అత్వెల్లి ఏడవ మెట్రో పాలిటన్ న్యాయమూర్తి 12గంటల పాటు ట్రాఫిక్ కంట్రోలింగ్ డ్యూటీ విధిస్తూ సోమవారం తీర్పునిచ్చారు.

మద్యం సేవించి వా హనం నడిపితే చర్యలు తప్పవని మేడ్చల్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ హెచ్చరించారు. వాహనదారులు రోడ్డు ఎక్కే ముందు ట్రాఫిక్ నియంత్రణలు పాటించాలని సూచించారు.