13-08-2025 05:46:36 PM
కరీంనగర్ (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా ఆడిట్ ఆఫీసర్(Siddipet District Audit Officer), సిద్దిపేట టిజీఓ జిల్లా కార్యదర్శి ఏ. జయశ్రీ కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం టిఎన్జీవో భవన్ కు విచ్చేయగా జిల్లా జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాలువా కప్పి, బోకే అందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో నాయకులు ఏవి రాజేశ్వరరావు, పవన్ శంకర్, చిరంజీవి, సచితు వెంకట్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం కార్యదర్శి శంకర్, ఆడిటు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.