13-08-2025 05:49:08 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): తిరంగా అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా బీజేపీ నార్త్ జోన్ ఏన్నం శ్రీనివాస్(BJP North Zone Yennam Srinivas) ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలోని సుభాష్ నగర్ లో సుభాష్ చంద్ర బోస్ విగ్రహం, అంబేద్కర్ నగర్ లో అంబేద్కర్ విగ్రహల శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టి, ఆ మహనీయులకు ఘన నివాళులు అర్పించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి మీడియా కన్వీనర్ కటకం లోకేష్ మాట్లాడుతూ, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని, పార్టీ సూచన మేరకు ఆగస్టు 15 వరకు చేపట్టాల్సిన తిరంగా యాత్ర ప్రోగ్రాంలను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.
త్రివిధ దళాలను ప్రశంసిస్తూ, వీరుల త్యాగాలను గుర్తిస్తూ ప్లకార్డులు ప్రదర్శించాలని సూచించారు. అదే విధంగా హర్ ఘర్ తిరంగ లో భాగంగా ఈస్ట్ జోన్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ లో తోట సాగర్ అధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహామును నీటితో శుద్ధి చేసి, ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమలలో పైడి ప్రసాద్, కైలాస నవీన్, బోయిని శ్రీనివాస్, కుర్ర రాజేష్, కట్ట రాజు, ఎలుక రాజేష్, రవి మరియు కట్కామ్ లోకేష్, వెన్నం శ్రీనివాస్, పైడి ప్రసాద్, కైలాస నవీన్, బోయిని శ్రీనివాస్, కుర్ర రాజేష్, కట్ట రాజు, ఎలుక రాజేష్, రవి, ఈస్ట్ జోన్ బీజేపీ అధ్యక్షులు అవుదుర్తి శ్రీనివాస్, సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాస్, అంజిరెడ్డి, ఊసుకమల్ల సంజీవ్, బాసబత్తుల మహేష్, తోట అనిల్, రవీందర్, హరీష్, రవి, అంజిరెడ్డి, కాలనీ పెద్దలు పాల్గొన్నారు.