13-08-2025 01:00:42 AM
- దేశవ్యాప్తంగా విడుదల చేసిన సంస్థ
- బీఎస్‌ఎఫ్‌తో స్వాతంత్య్ర వేడుకలు
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 12 (విజయక్రాంతి): భారతదేశపు అతిపెద్ద ఇన్‌స్టంట్ బీవరేజెస్ తయారీదారు రస్నా ప్రైవేట్ లిమిటెడ్ 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జంపిన్ పేరుతో 100 శాతం స్వదేశీ రెడీ టు డ్రింక్ ఫల రసాన్ని దేశవ్యాప్తంగా విడుదల చేసింది. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘స్వదేశీ ఉద్యమం’ పిలుపుకు ప్రతిస్పందనగా సాగిం ది.
ఈ సందర్భంగా రస్నా గ్రూప్ చైర్మన్ పీరుజీఖంబట్టా మాట్లాడుతూ.. “జంపిన్ స్వదేశీ ఉత్పత్తుల శక్తిని చూపించే మోడల్. ఇది భారతీయ రైతులు, ఎంఎస్‌ఎంఈఎస్‌మరియు లోకల్ సప్లయ్ చైన్లకు మద్దతు ఇస్తుంది” అన్నారు. జంపిన్ మామిడిపండు, కమలా, లిచీ మరియు మికస్డ్ ఫ్రూట్ వంటి రుచులలో లభిస్తుంది. ధరలు రూ.10 నుంచి రూ.85 వరకు లభిస్తుంది. ఈ సందర్భంగా రస్నా సంస్థ బీఎస్‌ఎఫ్ జవాన్లతో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించింది.