13-08-2025 05:26:00 PM
అర్హులకు అండగా ప్రభుత్వం..
తంగళ్ళపల్లి (విజయక్రాంతి): తంగళ్ళపల్లి మండలం నేరల్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రవీణ్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిజమైన పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ వారికి అండగా ఉంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఇసుక ఉచితముగా ఇవ్వడం జరుగుతుంది. లబ్ధిదారులు వినియోగించాల్సిందిగా కోరుతున్నాము. ప్రజా ప్రభుత్వంలో ఆరు గ్యారెంటీలు తప్పకుండా అమలు చేసి తీరుతామని తెలియజేయడం జరిగింది. లబ్ధిదారులు కాంగ్రెస్ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు లింగాల భూపతి, సత్తు శ్రీనివాసరెడ్డి, మునిగల రాజు,గుగ్గిళ్ళ భరత్, గ్రామ శాఖ అధ్యక్షుడు కోలశంకర్ ,ఆనందం, ఎల్లయ్య శ్రీను నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.