13-08-2025 05:23:21 PM
తుంగతుర్తి (విజయక్రాంతి): తుంగతుర్తి మండల(Thungathurthi Mandal) కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఉదయం 11 గంటలకు కళాశాల విద్యార్థులచే మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులను ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ రాజమోహన్ రావు మాట్లాడుతూ... మాదకద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ క్రియాశీలకమైన పాత్ర పోషించాలని, విద్యార్థులు అందరూ డ్రగ్స్ బారిన పడకుండా మంచి జీవనశైలిని అలవర్చుకోవాలని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరం సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల స్టూడెంట్ కౌన్సిలర్ పజ్జూరి పుల్లయ్య ఎన్ ఎస్ ఎస్ పిఓలు పొలగని నాగయ్య టీ ప్రవీణ్, అధ్యాపక అధ్యాపకేతర బృందం, కళాశాల విద్యార్థునీ, విద్యార్థులు పాల్గొన్నారు.