13-08-2025 05:44:53 PM
ఇన్చార్జి డిఈఓ మూడారపు పరమేశ్వర్..
నిర్మల్ (విజయక్రాంతి): పాఠశాలలోని విద్యార్థులు సమాజంలో మాదకద్రవ్యాల నిరోధానికై కృషి చేయాలని జిల్లా ఇన్చార్జి విద్యాశాఖ అధికారి మూడారపు పరమేశ్వర్(In-charge Education Officer Mudarapu Parameshwar) పిలుపునిచ్చారు. మాదకద్రవ్య నిరోధక ప్రతిజ్ఞలో భాగంగా బుధవారం నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఈదిగాం యందు విద్యార్థులచే సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం పాటుపడాలని కోరారు.
విద్యార్థులు పౌరులను, తమ తల్లిదండ్రులను మాదకద్రవ్యాల వినియోగంపై చైతన్యం కలిగించాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల అమ్మకాల వివరాలను కానీ, వాటిని వాడుతున్న వారి విషయాలు కానీ అధికారులకు సూచించి సమాజ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నీరాజారాణి ఉపాధ్యాయులు మోహన్ రావు, మణిందర్ రాజు తదితరులు పాల్గొన్నారు.