calender_icon.png 28 December, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేజర్‌తో ప్రతీకారం తీర్చుకుంటే?

28-12-2025 12:37:49 AM

యూనిక్ స్టొరీ టెల్లింగ్, వైవిధ్యమైన కథలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవిబాబు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘రేజర్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత సురేశ్‌బాబు నిర్మిస్తున్నారు. రవిబాబు శ్‌బాబు కాంబోలో మరోసారి వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకత్వంతోపాటు ఈ చిత్రంలో రవిబాబు హీరోగా కూడా నటిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

తాజాగా విడుదలైన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో చాలా ఆసక్తిని రేకెత్తించింది. విజువల్స్ పూర్తిగా రా అండ్ బ్రూటల్ టోన్‌లో ఉండగా, రవిబాబు రౌడీలను ఎదుర్కొనే విధానం, రేజర్‌తో చేసే హింసాత్మక దాడులు వణుకు పుట్టించేలా ఉన్నాయి. ఈ గ్లింప్స్ ప్రతీకారంతో నిండిన క్రైమ్ కథ సూచిస్తోంది. వేసవి కానుకగా 2026లో థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రానికి సంబంధించి మిగతా నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.