22-12-2025 09:18:26 PM
పెద్దమందడి: వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో సోమవారం సూర్య గంగమ్మ రవి లు సర్పంచ్ గా ఎన్నికైన సందర్భంగా పెద్దమందడి గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రమాణస్వీకారం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ సూర్య గంగమ్మ రవి, ఉప సర్పంచ్ బోయిని ఉషన్న యాదవ్, వాడు మెంబర్లు నీలం రవి, తన్వీర్ హమ్మద్, జ్యోతి, నిర్మలలు ఘనంగా ప్రమాణస్వీకారం చేశారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచును ఉప సర్పంచులు, వార్డు సభ్యులను ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ సూర్య గంగమ్మ రవి మాట్లాడుతూ... గ్రామ ప్రజల అభిష్టి మేరకు సమగ్రంగా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఎవరికి ఏ ఆపద వచ్చినా తాను ముందు ఉంటానని అన్నారు. అలాగే ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆధ్వర్యంలో పెద్దమందడి గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని సూర్య గంగమ్మ రవిలు తెలిపారు.