13-12-2025 01:46:58 AM
మహబూబాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల నేపథ్యం లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల మంటూ ముగ్గురు వ్యక్తులు అక్రమ వసూళ్లకు పాల్పడగా.. శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేసి, ఒకరిని అరెస్టు చేశారు. రూ. 50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 11న ములుగు నివాసి ధరావత్ ఆనంద్ పెద్ద వంగరలో తన బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూ రు పాలకేంద్రం దగ్గర ఆగి మద్యం కొని, కారులో వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు పోలీ స్ సైరన్ ఉన్న కారులో వెంబడించి దారి మధ్యలో అడ్డగించారు.
ఎన్నికల ఫ్లైయింగ్ స్కాడ్ అధికారులమని కారును తనిఖీచేయాలంటూ అందులో ఉన్న మద్యం పట్టుకు న్నారు. కేసు అవుతుందని, కేసు నుంచి వదిలిపెట్టాలంటే లక్ష రూపాయలు ఇవ్వా లంటూ బెదిరించారు. అంతేకాకుండా ఆనం ద్ కారు డ్రైవర్ కుమార్‌ను కారులోనే బం ధించారు. భయపడిపోయిన ఆనంద్ సమీప బంధువు దగ్గర లక్ష రూపాయలు సర్దుబాటు చేసి వీరికి ఇచ్చి, కారును, డ్రైవర్‌ను విడిపించుకు వెళ్లాడు.
ఆ తర్వాత ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, నింది తులు వినియోగించిన కారు ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు వారు అధికారులు కారని తేల్చారు. నిందితుల్లో ఒకరు జాటోత్ ఉపేందర్‌సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని, కారు, మొబైల్, రూ.50 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తొర్రూరు ఎస్సై జీ ఉపేందర్ తెలిపారు. ఈ సంఘటనలో తొర్రూరుకు చెందిన ఇద్దరూ మీడి యా ప్రతినిధులు ఉన్నట్లు గుర్తించామని, వారిని త్వరలో పట్టుకొని అరెస్టు చేయనున్నట్లు ఎస్సై వివరించారు.