13-12-2025 01:46:38 AM
పటాన్ చెరు, డిసెంబర్ 12 :పటాన్ చెరు పట్టణంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ మాద్రి జైపాల్ ఆధ్వర్యంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ స భ్యుడు, ఎండిఆర్ ఫౌండేషన్ కోఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రీజియన్ చైర్మన్ ఈ.వి. రమణ గారు మాట్లాడుతూ.. ఈ నెల 28వ తేదీన జరగనున్న రీజనల్ కా న్ఫరెన్స్ అవార్డు ఫంక్షన్కు సంబంధించిన విధివిధానాలను క్లబ్ సభ్యులకు వివరించారు.
సభ్యులందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అలాగే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కా ర్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలని సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ప్రకాశ్ రావు, వెంకటేశ్వర్లు, ఫయుం, కంకర శ్రీను, జనార్దన్ రెడ్డి, మీర్ బాయ్, కేపీఎం, రాఘవ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, తదితర సభ్యులు పాల్గొన్నారు.