calender_icon.png 14 December, 2025 | 12:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నానో యూరియాతో రైతులకు ప్రయోజనాలు

13-12-2025 01:47:59 AM

  1. రైతుల్లో చైతన్యం రావాలి

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

చేగుంట, డిసెంబర్ 12 :నానో యూరియాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని రైతులకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు, శుక్రవారం చేగుంట మండల కేంద్రంలో గల ఆగ్రోస్ 2 ఫర్టిలైజర్ దుకాణంను సందర్శించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నానో యూరియా వాడకం వల్ల దిగుబడిలో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని అత్యంత ప్రయోజన కరిణిగా ఉన్న నానో యూరియాని రైతులు వాడాలి, నానో యూరియా అనేది నానోటెక్నాలజీ సహాయంతో తయారు చేయబడిన ద్రవ రూపంలో ఉండే ఎరువని, దీనిని వాడకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు.

సాంప్రదాయ యూరియాతో పోలిస్తే నానో యూరియా తక్కువ మొత్తంలో వాడడం వల్ల..ఇది మట్టి, నీటి కాలుష్యాన్ని తగ్గిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు మంచి కట్ల శ్రీనివాస్, యూవ నాయకులు డిష్ రాజు, మైనారిటీ నాయకులు అలీ,మొహమ్మద్ ఖలీల్ హైమద్, పల్లెక్రాంతి కుమార్, మెడికల్ రాజు, షాప్ యజమాని ఆలం శ్రీకాంత్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు.