calender_icon.png 28 November, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పైప్‌లైన్ నిర్మాణ పనులను పూర్తి చేయాలి

28-11-2025 12:00:00 AM

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్

వినోభానగర్‌లో రూ. 6.50 లక్షలతో పైప్ లైన్ నిర్మాణ పనుల ప్రారంభం

ముషీరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): పైప్లైన్ నిర్మాణ పనులను త్వరిత గతిన పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ముషీరాబాద్ నియోజకవర్గం ముషీరాబాద్ డివిజన్లోని వినోభా నగర్లో రూ. 6.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ పైప్లైన్ విస్తరణ పనులకు  ముషీరాబాద్  ఎమ్మెల్యే ముఠా గోపాల్, ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్‌తో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ  ప్రాంతంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను శాశ్వతంగా పరి ష్కరించేందుకు ఈ పనులు వేగవంతంగా పూర్తవుతాయని  తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్య లను పరిష్కరించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వినోభా నగర్లో డ్రైనేజీ సమస్య తొలగించడం ద్వారా బస్తీలో శుభ్రత, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయని తెలిపారు.

పనులు నాణ్యతతో, సమ యానికి పూర్తి కావాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వాటర్ వరక్స్ డీజీఎం  మోహన్రాజ్, మేనేజర్ సురేష్, బీఆర్‌ఎస్ ముషీరాబాద్ మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, బీఆర్‌ఎస్ ముషీరాబాద్ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కొండ శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆకుల అరుణ్, సీనియర్ నాయకులు తల్లారి శ్రీకాంత్ ముదిరాజ్, శివ ముదిరాజ్, దీన్ దయాల్ రెడ్డి, పూస గోరకనాథ్, సత్యనారాయణ బాబు, అనిల్ కుమా ర్ టిల్లు, వెంకటేష్, జావీద్, ఖాన్, బలవంత్ రాజ్, సర్వర్, జఫ్ఫార్ ఖాన్, రాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. కాగా స్థానిక బస్తీవాసు లు ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్  కృతజ్ఞతలు తెలియజేశారు.