24-05-2025 02:04:53 AM
-ఇందుకు రెండు రాష్ట్రాలు సమన్వయంతో ఉండాలి
-విభజన తర్వాతి పెండింగ్ అంశాలను పరిష్కరించుకోవాలి
-హైదరాబాద్‌లోని ఉమ్మడి భవన్ తెలంగాణకే
-తెలంగాణ, ఏపీ మంత్రులు ఉత్తమ్, నాదెండ్ల మనోహర్
హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మనోహర్ శుక్రవారం హైదరాబాద్‌లోని సివిల్ స ప్లయ్ కార్యాలయంలో భేటీ అయ్యా రు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య సివిల్ సప్లయీస్‌కు సంబంధించిన సమస్యలను చ ర్చించుకున్నారు.
బియ్యం సేకరణ, పంపి ణీ, రేషన్ సరఫరాలలో ఇరు రాష్ట్రాల సమన్వ యం వంటి అంశాలపై కీలక చర్చ జరిగింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సివిల్ సప్లుసై కార్పొరేషన్ ద్వారా బియ్యం సేకరణ, పుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సరఫరా లో ఇరు రాష్ట్రాలు సమన్వయంతో పని చేశాయని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అ పరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చించా రు.
కార్పొరేషన్ ఆస్తులను దశలవారిగా తెల ంగాణకు బదిలీ చేసే అంశంపై కూడా చర్చ జరిగిందతి. తెలంగాణలో ఉన్న కార్పొరేషన్ ఆస్తులు, రాష్ట్రానికే చెందుతాయని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. బియ్యం ఎగుమతులు వంటి అంశాలపై తెలుగు రాష్ట్రాల మధ్య సహకార బలోపేతంపై చర్చించారు. తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతి చేస్తున్న అంశంపై ఏపీ సహకారంపై అభినందనలు తెలిపారు. పౌర సరఫరాల భవన్ పూ ర్తిగా తెలంగాణకే వర్తిస్తుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
ఏపీలో రేషన్ కార్డుదారులకు నెలకు 5 కిలోల ఉచిత బి య్యం, చక్కెర, నూనె, పప్పు దినుసుల సరఫరాకు ఏర్పా ట్లు చేస్తున్నట్టు మనోహర్ వివరించారు. సరిహద్దు ప్రాంతాల్లో రేషన్ అక్రమ రవాణా వ ంటి సమస్యలపై చర్యలు తీ సుకోవాలని నిర్ణయించారు. తెలంగాణలో ఉచిత బియ్యం పంపిణీ కొనసాగుతున్నా, ధాన్యం సేకరణ లో కనీస మద్దతు ధర అమలులో సమస్యలు ఉన్నాయని, అక్రమ రవాణాను నియ ంత్రించడానికి ఉమ్మడి చర్యలు అవసరమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూ చించారు. ఎఫ్‌సీఐకి బియ్యం సరఫరాలో కేంద్రంతో సమన్వ యం చేసుకోవాలని, సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని, ఎంఎస్‌పీ సకాలంలో అందేలా చ ర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.