calender_icon.png 24 May, 2025 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌కు మిల్లెట్ సెంటర్

24-05-2025 01:11:07 AM

రూ.250 కోట్లతో పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయనున్న కేంద్రం

  1. హైదరాబాద్‌లో అత్యాధునిక ఐటీఐ ట్రైనింగ్ సెంటర్
  2. సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్
  3. రైతుల నుంచి ఎంత ధాన్యం కొనేందుకైనా కేంద్రం సిద్ధం
  4. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాలి
  5. డాడీ-డాటర్ లేఖ ఓ డ్రామా: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): రాష్ట్రానికి తాజాగా మూడు కొత్త కేంద్ర సంస్థలు మంజూరయ్యాయని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జీ కిషన్ రెడ్డి తెలిపారు. వివిధ రీసెర్చ్ సంస్థలకు కేంద్రప్రభుత్వం విస్తృతంగా మౌలిక సదుపాయాలు కల్పించబోతుందని చెప్పారు. రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి మిల్లెట్స్ పరిశోధనా కేంద్రాన్ని కేంద్రం మంజూరు చేసిందని.. రూ.250 కోట్లతో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్‌ను కేంద్ర వ్యవసాయ శాఖ ఏర్పాటు చేయనుందని తెలిపారు.

బీజేపీ రాష్ట్ర కార్యాల యంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, ఆరోగ్యకరమైన భారత నిర్మాణం కోసం 2023, మార్చి 18న పీఎం శ్రీ అన్న పథకాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ఇప్పటికే ఐ కార్ పరిధిలోని ఐఐఎంఆర్ ఆధ్వర్యంలో మిల్లెట్స్‌పై పరిశోధనలు జరుగుతున్నాయని, వీటిని మరింత సమర్థవంతంగా కొన సాగించేందుకు కొత్తగా ఏర్పడే గ్లోబల్ సెం టర్ కీలకపాత్ర పోషిస్తోందన్నారు.

హైదరాబాద్‌లో ఏర్పాటు కాబోతున్న ఈ కేంద్రంలో సెం ట్రల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ల్యాబ్, ఇంటర్నేషనల్ హాస్టల్, మిల్లెట్స్ మ్యూజియం, రీసెర్చ్ ఫామ్‌లు, ట్రైనింగ్ రూములు, ఇంటర్నేషనల్ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేయను న్నారని తెలిపారు. అలాగే జీన్ ఎడిటింగ్ గ్రీన్ హౌజ్‌లు, స్పీడ్ బ్రీడింగ్ ల్యాబ్స్, ఫినోమిక్స్ ల్యాబ్స్ వంటి ఆధునిక పరిశోధనా వసతులు అందుబాటులోకి వస్తాయన్నారు.

మిల్లెట్స్ సాగుకోసం నాణ్యమైన విత్తనాలను రాష్ట్ర రైతులకు అందించనున్నారని వివరించారు. ఐఐఎంఆర్‌తో పాటు కొత్తగా ఏర్పడే ఈ కేంద్రం ద్వారా రైతులకు రెగ్యులర్ శిక్షణ, వ్యాల్యూయాడెడ్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్‌కు సహకారం, స్టార్టప్‌లకు ప్రోత్సాహం లభించనుందని వెల్లడించారు. 

ఐటీఐల అప్‌గ్రెడేషన్ కోసం ట్రైనింగ్ సెంటర్..

దేశంలో వృత్తివిద్యకు సంబంధించి 1950 నుంచి ఐటీఐలు పని చేస్తున్నాయని, ఈ కీలక విద్యా సంస్థల సంఖ్యను పెంచేందుకు కేంద్రప్రభుత్వం నిరంతరం కృషి చే స్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. గత మూడున్నరేండ్లలో 47 శాతం వృద్ధితో దేశవ్యా ప్తంగా ఐటీఐల సంఖ్య 14,600కి చేరుకుందన్నారు.

వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఐటీఐల ఉన్నతీకరణకు రూ.60 వేల కోట్ల వ్యయంతో ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. ఈ క్రమంలో హైదరాబాద్, భువనేశ్వర్, చెన్ను, కాన్పూర్, లూథియానాల్లో అత్యాధునిక ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయని.. ఈ కేం ద్రాలు ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్ కార్యక్రమంతో పాటు, ఐటీఐలకు అవసరమైన ఆధునిక మౌలిక వసతుల కల్పన కోసం కృషిచేస్తాయని వివరించారు.

సికింద్రాబాద్ కేంద్రంగా కవచ్‌తో భద్రత.. 

రైల్వే భద్రత కోసం కేంద్రం కవచ్ ప్రాజెక్టును తీసుకొచ్చినట్టు కిషన్‌రెడ్డి తెలిపారు. కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ త్వరలో సికింద్రాబాద్‌లో అందుబాటులోకి రాబోతుం దని స్పష్టం చేశారు. తాత్కాలికంగా ఈ కేం ద్రానికి రూ.41 కోట్లు, పూర్తి స్థాయి నిర్మాణానికి రూ.274 కోట్లను కేంద్రం మంజూరు చేసిందన్నారు. దేశీయంగా అభివృద్ధి చేస్తు న్న కవచ్ టెక్నాలజీపై విస్తృత పరిశోధనలను ఈ కేంద్రం చేపట్టనుందన్నారు.

రైల్వే పైలె ట్లు, టెక్నీషియన్లకు క్వాలిటీ శిక్షణ, విద్యాసంస్థలతో భాగస్వామ్యం ద్వారా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపడతారన్నారు. రైల్వే సిగ్నలింగ్ వంటి అంశాల్లో ఇంజినీరింగ్ విద్యా ర్థులకు ప్రత్యేక శిక్షణ, సర్టిఫికేషన్ కోర్సులు అందించనున్నారని వెల్లడించారు.

కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మహాత్మా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (హైదరాబాద్), మదన్ మోహన్ మాలవీయ యూనివర్సిటీ (గోరఖ్‌పూర్), ఎంబీఎం యూనివర్సిటీ (జోధ్‌పూర్) సంస్థలతో ఒప్పందాలు కుదుర్చు కుందన్నారు. తెలంగాణలో ఆధునీకరించిన మూడు రైల్వే స్టేషన్లను ప్రారంభించగా, మ రో 37 స్టేషన్లు నిర్మాణంలో ఉన్నాయని, 2026 నాటికి మొత్తం 40 స్టేషన్లను అందుబాటులోకి తెస్తామన్నారు. 

ఎంత ధాన్యమైనా కొంటాం

రాష్ర్ట ప్రభుత్వం ఎంత ధాన్యం సేకరించినా కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభు త్వం సిద్ధంగా ఉందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశా రు. అవసరమైతే అదనపు సెంటర్లను ఏర్పా టు చేసి కొనుగోళ్లు పెంచాలన్నారు. తెలంగాణలో వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారని.. పంటలు కల్లాల్లోనే ఉండిపోయాయన్నారు.

కేంద్ర ప్ర భుత్వంతో రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికే 53 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు ఒప్పందం కుదుర్చుకుందని.. దానికి సంబంధించిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అందించేలా ఒ ప్పందం చేసుకుందన్నారు. ధాన్యం సేకరణ విషయంలో రాష్ర్ట ప్రభుత్వంపై రూపాయి కూడా అదనపు భారం ఉండదన్నారు. 

కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాలి

కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన కేసును సీబీఐకి అప్పగించాల్సిందిగా రాష్ర్ట ప్రభుత్వాన్ని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తన కూతురు కవిత రాసి న లేఖ విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదన్నారు. అది డాడీ మధ్య అంతర్గత లేఖ అని, ఓ డ్రామాగా అభివర్ణించారు. బీఆర్‌ఎస్ మునిగిపో తున్న నౌకలాంటిదని.. అలాంటి పార్టీలో ఇలాంటి ఘటనలు సహజమేనన్నారు.

రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్‌కు భవిష్యత్తే లేదని.. కవిత రాసిన లేఖలో తెలంగాణలో ప్రత్యామ్నాయంగా బీజేపీనే ఉందని ప్రజలు అనుకుంటున్నట్టు ఆమె చెప్పిందన్నారు. దేశానికి కుటుంబ పార్టీలు ప్రమాదకరమని.. ఈ పార్టీల వల్ల అనేక సమస్యలు ఏర్పడతాయన్నారు.

కేసీఆర్ గతంలో ఎప్పుడూ ప్రజాసంఘాలను, రైతు సంఘాలను, విద్యార్థి సంఘాలను కలవలేదని, 2019లో కేంద్రమంత్రి అయిన తర్వాత కూడా కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా తాను కలవాలనుకున్నా.. ఆయన అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. 

తాను రేవంత్‌రెడ్డి ఇచ్చే సర్టిఫికెట్ కోసం నేను పనిచేయడం లేదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వివిధ రూపాల్లో పోరాటాలు చేశానని.. బీజేవైఎం నాయకుడిగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా అనేక సదస్సులు నిర్వహించానని తెలిపారు.