calender_icon.png 24 May, 2025 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీ డీకే అరుణకు కీలక పదవి

24-05-2025 02:08:30 AM

-ఎఫ్‌సీఐ కన్సల్టెటివ్ కమిటీ తెలంగాణ చైర్‌పర్సన్‌గా నియామకం 

మహబూబ్‌నగర్, మే 23 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్ ఎంపీ అరుణకు అరుదైన గౌరవం లభించింది. ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా కన్సల్టెటీవ్ కమిటీ తెలంగాణ చైర్‌పర్సన్‌గా అరుణకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఆహార ఉత్పత్తులు, ధాన్యం సేకరణలో ఇబ్బందులు, ఇతర సమస్యలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి నివేదిక తయారు చేస్తామని ఎంపీ డీకే అరుణ తెలిపారు. బాధ్యతలు అప్పగించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.