calender_icon.png 16 October, 2025 | 12:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నన్ను క్షమించండి: అయ్యంగార్

14-10-2025 12:00:00 AM

గాంధీ జయంతి సందర్భంగా టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. గాంధీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి శ్రీకాంత్ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.  దీంతో శ్రీకాంత్ అయ్యంగార్ సోషల్‌మీడియా వేదికగా క్షమాపణలు కోరారు.

తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేసిన వీడియోలో “నా వ్యాఖ్యలతో ఎంతో మంది బాధపడ్డారని తెలిసింది. వారందరినీ నేను మనస్ఫూర్తిగా క్షమించమని కోరుతున్నా. స్వాతంత్య్ర పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. వారందరినీ గుర్తుంచుకోవాల్సిన బాధ్యత మనందరిది. భవిష్యత్తులో ఇలాంటి విషయాల వల్ల మన మధ్య విభేదాలు రాకుండా చూసుకుంటా. దేశాభివృద్ధిలో మనమంతా కలిసి ముందుకు సాగుదాం” అని పేర్కొన్నారు.