calender_icon.png 16 October, 2025 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్టహాసంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానం

13-10-2025 01:01:26 AM

-‘లపతా లేడీస్’కు 13 క్యాటగిరీల్లో అవార్డులు

-ఉత్తమ నటుడు అభిషేక్‌బచ్చన్ (ఐవాంట్ టు టాక్), కార్తీక్ ఆర్యన్(చందు ఛాంపియన్)

-ఉత్తమ నటిగా అబియాభట్ (జిగ్రా)

-వేడుకకు హాజరైన షారుఖ్‌ఖాన్ తదితర ప్రముఖులు

ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం శనివారం అహ్మదాబాద్‌లోని కంకారియా లేక్లో ని ఈకేఏ అరీనాలో ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ బాలివుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ కరణ్ జోహార్, మనీష్‌పాల్‌తో కలిసి ఆతిథ్యం ఇచ్చారు. 2024 విడుదలైన సినిమాలను ఎంపిక చేసి, వివిధ విభాగాలలో అవార్డులు అందజేశారు.

ఇం దులో ‘లాపతా లేడీస్’ సినిమా ఏకంగా 13 క్యాటగిరీలలో అవార్డులు సొంతం చేసుకుంది. ’కిల్’ మూవీ 6 అవార్డులతో మెరిసిం ది. ఉత్తమ నటుడి పురస్కారాన్ని అభిషేక్ బచ్చన్ (ఐ వాంట్ టు టాక్), కార్తీక్ ఆర్యన్ (చందు ఛాంపియన్) స్వీకరించారు. ‘జిగ్రా’ సినిమాకిగానూ ఉత్తమ నటి అవార్డును అలియా భట్ అందుకున్నారు.

విజేతల పూర్తి జాబితా:

ఉత్తమ ప్రధాన నటుడు -అభిషేక్ బచ్చన్ (ఐ వాంట్ టు టాక్), కార్తీక్ ఆర్యన్ (చందు ఛాంపియన్)

ఉత్తమ నటుడిగా విమర్శకుల అవార్డులు - రాజ్కుమార్ రావు (శ్రీకాంత్)

ఉత్తమ నటిగా క్రిటిక్స్ అవార్డులు--ప్రతిభా రంతా (లాపటా లేడీస్)

ఉత్తమ సహాయ నటి--ఛాయా కదమ్ (లాపతా లేడీస్)

ఉత్తమ సహాయ నటుడు --రవి కిషన్ (లాపటా లేడీస్)

ఉత్తమ చిత్రంగా విమర్శకుల అవార్డు - షూజిత్ సిర్కార్ (ఐ వాంట్ టు టాక్)

ఉత్తమ తొలి నటి--నితాన్షి గోయెల్ (లాపతా లేడీస్) 

ఉత్తమ తొలి నటుడు పురుషుడు--లక్ష్య (కిల్)

ఉత్తమ నూతన దర్శకుడు--కునాల్ 

కెమ్ము (మడ్గావ్ ఎక్స్ప్రెస్), ఆదిత్య సుహాస్ జంభలే (ఆర్టికల్ 370)

ఉత్తమ యాక్షన్ - సీయాంగ్ ఓ, పర్వేజ్ షేక్ (కిల్)

ఉత్తమ స్క్రీన్ ప్లే--స్నేహ దేశాయ్ (లాపతా లేడీస్)

ఉత్తమ కథ--ఆదిత్య ధర్, మోనాల్ ఠక్కర్ (ఆర్టికల్ 370)

ఉత్తమ డైలాగ్--స్నేహ దేశాయ్ (లాపతా లేడీస్)

ఉత్తమ సంగీత ఆల్బమ్--రామ్ సంపత్ (లాపతా లేడీస్)

ఉత్తమ సాహిత్యం-- ప్రశాంత్ పాండే (లాపతా లేడీస్) 

ఉత్తమ నేపథ్య గాయకుడు--అరిజిత్ సింగ్ (లాపతా లేడీస్)ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ 

ఫిమేల్--మధుబంతి బాగ్చి (స్ట్రీ 2)

ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే - రితేష్ షా, తుషార్ శీతల్ జైన్ (ఐ వాంట్ టు టాక్)

ఉత్తమ చిత్రం - లాపాటా లేడీస్

ఉత్తమ దర్శకుడు--కిరణ్ రావు (లాపటా లేడీస్)

ఉత్తమ చిత్రంగా విమర్శకుల అవార్డు - ఐ వాంట్ టు టాక్ (షూజిత్ సిర్కార్) 

ఉత్తమ సౌండ్ డిజైన్ - సుభాష్ సాహూ (కిల్)

ఉత్తమ నేపథ్య సంగీతం--రామ్ సంపత్ (లాపతా లేడీస్)

ఉత్తమ వీఎఫ్‌ఎక్స్ --రీడెఫైన్ (ముంజ్య)

ఉత్తమ కొరియోగ్రఫీ-- బాస్కో-సీజర్ (బాడ్ న్యూజ్ నుండి తౌబా తౌబా)

ఉత్తమ ఎడిటింగ్ - శివకుమార్ వి. పనికర్ (కిల్)

ఉత్తమ దుస్తులు--దర్శన్ జలన్ (లాపతా లేడీస్)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - మయూర్ శర్మ (కిల్)

ఉత్తమ సినిమాటోగ్రఫీ - రఫే మెహమూద్ (కిల్)

ప్రత్యేక అవార్డులు:జీవిత సాఫల్య పురస్కారం - జీనత్ అమన్, శ్యామ్ బెనెగల్ (మరణానంతరం)

సంగీతంలో రాబోయే ప్రతిభకు ఆర్డి బర్మన్ అవార్డు--అచింత్ ఠక్కర్ (జిగ్రా, మిస్టర్ అండ్ మిసెస్ మహి)