calender_icon.png 16 October, 2025 | 8:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కే -ర్యాంప్‌లో వినోదానికి లోటుండదు

14-10-2025 12:00:00 AM

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా ‘కే -ర్యాంప్’. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జైన్స్ నాని దర్శకుడు. దీపావళి సందర్భంగా ఈ నెల 18న విడుదల కానుందీ సినిమా. ఈ సందర్భంగా సోమవారం జరిగిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ జైన్స్ నాని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “-కే -ర్యాంప్’ బూతు పదం అని ఆలోచించలేదు. చిత్రంలో హీరో క్యారెక్టర్ పేరు కుమార్. కథానుసారం అతని క్యారెక్టర్ ఇబ్బందుల్లో పడుతుంది.

అలా కథకు, హీరో క్యారెక్టరైజేషన్‌కు సరిపోయేలా టైటిల్ ‘కే ర్యాంప్’ అని పెట్టాం. ట్రైలర్ చూసి ఒకట్రెండు మాటలు ఇబ్బందిగా ఉన్నాయని అనుకోవద్దు. ఏ సినిమాకైనా ముందు యూత్ ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేయాలని ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నంలో భాగంగానే ట్రైలర్ కట్ చేశాం. యూత్‌కు నచ్చితే వాళ్లే ఫ్యామిలీని తీసుకొస్తారు. ప్రతి ఒక్కరూ రిలేట్ అయ్యేలా స్టోరీ ఉంటుంది. పేరెంట్స్ ఈ సినిమా చూడాలి. కొన్ని సినిమాల్లో మూవ్‌మెంట్స్ మాత్రమే ఉంటాయి. కానీ, ఇందులో మంచి కథ ఉంది. మూవ్‌మెంట్స్ కూడా డిజైన్ చేశాం. ఇంటర్వెల్ బాంగ్ సర్‌ప్రైజ్ చేస్తుంది. కథ ఓకే అయ్యాక కిరణ్ అబ్బవరం బాడీ లాంగ్వేజ్, ఎనర్జీని బట్టి స్క్రిప్ట్‌లో బెటర్‌మెంట్స్ చేసుకున్నాం. 47 రోజుల్లో షూటింగ్ చేశాం. 

హీరోయిన్‌గా యుక్తిని అనుకున్న తర్వాత వర్క్‌షాప్ చేయించాం. కీ సీన్స్ అన్నీ రిహార్సల్స్ చేసి షూటింగ్‌కు వెళ్లాం. హీరోహీరోయిన్స్ క్యారెక్టర్స్‌కు పర్‌ఫార్మెన్స్‌పరంగా చాలా స్కోప్ ఉన్న కథ ఇది. కామ్నా జెఠ్మలానీ చిన్న గెస్ట్ రోల్ చేశారు. సీనియర్ నరేశ్‌తో ఆమెకు కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. దీపావళికి మన బాక్సాఫీస్ వద్ద కాంపిటేషన్ ఉంది. అయితే మా టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని సినిమాలు హిట్ కావాలి. మాది ఇంకొంచెం పెద్ద హిట్ కావాలి” అన్నారు.