calender_icon.png 4 May, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత సాంస్కృతిక వారసత్వాన్ని చాటేలా చిత్రాలు

03-05-2025 12:45:13 AM

వేవ్స్ వేదికగా 9 ప్రాజెక్టులను ప్రకటించిన లైకా సంస్థ

అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముంబయిలో వేవ్స్ (వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్) సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. ఈ వేదికపై లైకా సంస్థ తమ భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి ప్రకటించింది. ప్రధాని మోదీ విజన్, లక్ష్యాలకు అనుగుణంగా భారత్‌ను అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తీర్చి దిద్దేందుకు మహవీర్ జైన్ ఫిల్మ్స్‌తో కలిసి 9 ప్రాజెక్టులను చేయబోతున్నట్టు వెల్లడించింది లైకా ప్రొడక్షన్. ఈ సందర్భంగా లైకా సంస్థ గ్రూప్ చైర్మన్ డాక్టర్ సుభాస్కరణ్ మాట్లాడుతూ..

‘భారతీయ మూ లాలు కలిగిన ప్రపంచ సంస్థగా లైకా గ్రూప్ భారతీయ సినిమాకు, ప్రపంచ ప్రేక్షకులకు మధ్య వారధిగా పనిచేయడానికి మరింతగా కృషి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు భారతదేశ అసాధారణ సాంస్కృతిక వారసత్వం, కథల్ని చెప్పేందుకు, మన సంప్రదాయాలను చాటి చెప్పేందుకు,

వరల్డ్ కంటెంట్‌ను రూపొందించడానికి మహావీర్ జైన్ ఫిల్మ్స్‌తో భాగస్వామ్యం అవ్వడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. ఈక్రమంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అశ్వినీ వైష్ణవ్, హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్‌లత చైర్మన్ అల్లిరాజా సుభాస్కరణ్, మహవీర్ జైన్ ముచ్చటించారు.