calender_icon.png 1 August, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల సంక్షేమమే లక్ష్యంగా పథకాల అమలు

30-07-2025 12:53:33 AM

  1. ఇందిరా మహిళా శక్తి, రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం

ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, కలెక్టర్ బి.యం. సంతోష్ 

గద్వాల, జూలై 29 ( విజయక్రాంతి ) : రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమమే లక్ష్యం గా అనేక పథకాలు అమలు చేస్తుందని, ఇట్టి అవకాశాలను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకుని, అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు. మంగళవారం మల్దకల్ మండల కేంద్రంలో జిల్లా గ్రామీణ అ భివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి, రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో గద్వాల్ శాసన స భ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడు తూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేస్తూ,వారి సాధికారత కోసం అనేక పథకాలను అమలు చే స్తోందని పేర్కొన్నా రు. మల్దకల్ మండలంలో ప్ర స్తుతం 600 పైగా మహిళా సం ఘాలు క్రి యాశీలంగా పనిచేస్తుండగా,వా టిలో 8000 మందికిపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారని, ఇంకా అనేక మంది మహిళలు ఈ సంఘాల్లో చేరాలని అన్నారు.

మ హిళా సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు, ఉపాధి అవకాశాలు, వడ్ల కొనుగోలు కేంద్రా లు, యూనిఫామ్ ల తయారీ వంటి ఉపాధి ఆధారిత పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. మల్దకల్ మండ లంలోని మహిళా సంఘాలకు గత ఏడాది రూ.26 కోట్లు రుణంగా మంజూరు చేయ గా, ఈ ఏడాది రూ.72 లక్షల వడ్డీ మాఫీ క ల్పించబడిందని తెలిపారు.

యూనిఫామ్ స్టిచింగ్ కోసం మహిళా సంఘాలకు రూ.4, 36,000 మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. గ్రామీణ మహిళల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు రూ.15.80 కోట్ల ఎంట్ర్పజ్ గ్రౌండింగ్ అమౌంట్ ప్రభుత్వం విడు దల చేసినట్లు తెలిపారు.మహిళల కోసం పెట్రోల్ బంక్,రూ.3 కోట్ల వ్యయంతో 1 మె గావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. 

మహిళల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత... ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. మహిళల కోసం రూపొందించిన మహా లక్ష్మీ పథ కం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉ చిత విద్యుత్ లాంటి ప్రయోజనాలు అందించడం జరుగుతుందన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల ను మహిళల పేరుమీద మంజూరు చేస్తుండటంతో పాటు, మహిళా సంఘాల ద్వారా సోలార్ ప్లాంట్లు,అద్దె బస్సులు, పెట్రోల్ పం పులు,రైస్ మిల్లులు, కుట్టుమిషన్లు వంటి వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వ రులు చేయాలన్న సంకల్పంతో వడ్డీ లేని రు ణాలు, ఆదాయ మార్గాలు అందిస్తున్నామన్నారు.

ప్రతి పేదవాడికి ఇల్లు,ప్రతి అర్హుడికి రేషన్ కార్డు అందేలా చర్యలు తీసుకుంటున్నామని,సన్న బియ్యం పథకాన్ని దేశంలోనే ప్రత్యేకంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మల్దకల్ మండలంలో సాగు నీటి కాలువలు, త్రాగునీటి సదుపాయాలు, రో డ్లు, వైద్య,విద్యా రంగ అభివృద్ధి వంటి పను లు వేగంగా జరిగేలా కృషి చేస్తామని అన్నా రు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ,నర్సింగ రావు,సంబంధిత అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, మహిళలు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.