calender_icon.png 22 November, 2025 | 10:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్యంతో చదివితే ఉన్నత శిఖరాలకు

22-11-2025 10:24:16 PM

ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి..

చిన్న చింతకుంట: ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు లక్ష్యంతో చదువుకుంటే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు షూ, టై,బెల్టుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పిన పాఠ్యాంశాలను శ్రద్ధగా విని మంచి మార్కులు సాధించి పై చదువుల్లో రాణించాలని ఆయన కోరారు. విద్యతో పాటు వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.  సుదూర గ్రామాల నుంచి చెప్పులు లేకుండా పాఠశాల కు వస్తున్నారని, కొన్ని కంపెనీలు సేవా దృక్పథంతో పాఠశాలలోని విద్యార్థులకు షూ, బెల్టులు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.

ప్రవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది ఉత్తమ విద్య అందించేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈ స్థాయికి చేరుకున్నామని మీరు కూడా ఇష్టంతో చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ కొరకు ఐదు లక్షలు, స్టేజీ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం 2965 విద్యార్థిని విద్యార్థులకు షూ, బెల్టు, టైలను అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు నరేందర్ రెడ్డి మార్కెట్ చైర్మన్ కథలప్ప, పిసిసి ఆర్గనైజేషన్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి, ఎంఈఓ మురళీకృష్ణ, పాఠశాల జిహెచ్ఎం మాధవి, లతో పాటు నాయకులు వెంకటేష్, రంజిత్ రెడ్డి, ఆయా గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.