22-11-2025 10:20:56 PM
కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన నాయకుని గుర్తించిన ఏఐసిసి, పిసిసి కార్యవర్గం..
డిసిసి పదవి పొందడం పట్ల.. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు బంధువులు, శ్రేయోభిలాషులు హర్షం..
తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా డిసిసి అధ్యక్షుడిగా తుంగతుర్తి మండలం వెలుగు పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుడిపాటి నరసయ్యకు వరించింది. చిన్నతనం నుండి ఎన్నో కష్టాలనుభవించి చదువులో రాణించి, మాజీ మంత్రి కీర్తిశేషులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఎదిగిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని, ఎన్నో కష్టాలు అనుభవించి, చివరి దశలో ఎమ్మెల్యే సీటు వచ్చి, బీఫారమును పొందలేక తన సీటును కూడా త్యాగం చేసిన వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీ గుర్తించి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం అనునిత్యం శ్రమించిన వ్యక్తిగా చెప్పవచ్చు.
టిపిసిసి తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేల సహకారంతోను తాను డిసిసి పదవి పొందినట్లు, చాలా సంతోషంగా ఉందని, జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏకతాటిపై రానించి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుపొందిన కృషి చేస్తానని పేర్కొన్నారు. ఏది ఏమైనా జిల్లా అధ్యక్షుడిగా గుడిపాటి నర్సయ్య ఎంపిక పట్ల సూర్యాపేట జిల్లా, నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.