calender_icon.png 12 January, 2026 | 9:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనం చేసిన అభివృద్ధే.. మనకు శ్రీరామరక్ష

12-01-2026 12:00:00 AM

కార్యకర్తల ఏకాభిప్రాయంతోనే అభ్యర్థుల ఎంపిక..

నిత్యం ప్రజాసేవలో ఉన్నవాళ్లకు  ప్రాముఖ్యత..

మాజీ మంత్రి సింగిరెడ్డి  నిరంజన్ రెడ్డి 

వనపర్తి, జనవరి 11 (విజయక్రాంతి): పట్టణములో మనం చేసిన అభివృద్ధి మనకు శ్రీ రామరక్ష గా ఉండి మనని గెలిపిస్తుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం లో భాగంగా ఆదివారం  జిల్లా పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ,మాజీ ఎంపీ రావుల.చంద్రశేఖర్ రెడ్డి లు హాజరయ్యారు.

ఈ సందర్బంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నాయకులు మనం చేపట్టిన రోడ్ల విస్తరణ, పార్కుల సుందరీకరణ, చెరువుల దురస్తూతో ఏర్పాటు చేసుకున్న ట్యాంక్ బండ్లు, జిల్లా కలెక్టరేట్,మాత శిశు సంక్షేమ కేంద్రం, సుందరమైన అంతర్గత సి.సి రోడ్లు, నిత్యం మంచినీటి సరఫరా, టౌన్ హాల్, సమీకృత మార్కెట్, తదితర పనులు ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించాలని పిలుపునిచ్చారు. రెండేండ్లలో పాలన విధ్వంసాన్ని ప్రజలకు వివరించాలని అన్నారు. మళ్ళీ మనకు అవకాశం పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని హామీ ఇవ్వాలని అన్నారు. ఆశావాహులు ఎందరున్నా కార్యకర్తల ఏకాభిప్రాయంతోనే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఐకమత్యంతో పని చేసి మున్సిపల్ ఎన్నికలో గులాబీ జెండా ఎగురవేసి పార్టీ ప్రతిష్ఠ పెంచాలని అన్నారు.

పార్టీ గెలుపు కోసం శ్రమించే నాయకులను పార్టీ గుర్తిస్తుంది

మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎం.పి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖరరెడ్డి పిలుపు నిచ్చారు. పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరు గ్యారంటీలు,420హామీలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతుందని అన్నారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి  హయంలో పట్టణాభివృద్ధి పరుగులు పెట్టిందని మన అభివృద్ధి మనల్ని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలలో మంచిపేరు,సేవాభావం కలిగిన అభ్యర్థులను నిర్ణయిద్దామన్నారు. అవకాశం రాని నాయకులకు భవిష్యత్తులో పార్టీ గుర్తించి పదవులు ఇస్తుందని ఎవ్వరూ కూడా నిరాశ చెందవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశములో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,కురుమూర్తి యాదవ్, గంధం బాలపేరు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.