calender_icon.png 12 January, 2026 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు పాలమూరుకు కేటీఆర్ రాక

12-01-2026 12:00:00 AM

ఏర్పాట్లను పరిశీలించిన బీఆర్‌ఎస్  జిల్లా అధ్యక్షులు డాక్టర్ సీ లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, జనవరి 11 (విజయక్రాంతి): బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీసీ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభకు నేడు విచ్చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పిస్తా హౌస్ నుంచి సభా స్థలం వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పార్టీ ముఖ్య నాయకులు ప్రజలు కార్యకర్తలు భారీ ఎత్తున సభకు విచ్చేయాలని వారు కోరారు.