calender_icon.png 12 January, 2026 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేద్దాం

12-01-2026 12:00:00 AM

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్నగర్, జనవరి 11 (విజయక్రాంతి): ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసేందుకు ప్రతిక్షణం అందరం సమిష్టిగా ఉండి శ్రమిద్దామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  మహబూబ్నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ అధ్యక్షతన డీసీసీ కార్యాలయంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆశావహులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే గ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ అందుతున్నాయని, అందుకే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన ఫలితాలు వచ్చాయని తెలిపారు.  గత రెండు సంవత్సరాల కాలంలో మహబూబ్నగర్ పట్టణంలో రూ.2 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. 

గత రెండు సంవత్సరాలుగా రూ.100 కోట్లతో పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధి పనులు, రూ.603 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, రూ.20 కోట్లతో ఎంవీఎస్ డిగ్రీ కళాశాల నిర్మాణం, రూ.220 కోట్లతో పట్టణానికి శాశ్వత వాటర్ సప్లై పరిష్కారం, రూ.400 కోట్లతో ఐఐఐటీ కళాశాల నిర్మాణం చేపట్టామని వివరించారు.  రూ.100 కోట్లతో పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు, రూ.17 కోట్లతో ఫూలేఅంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు, రూ.40 కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మరియు హాస్టల్స్ అభివృద్ధి, రూ.200 కోట్లతో సమీకృత పాఠశాలల ఏర్పాటు, రూ.300 కోట్లతో బైపాస్ రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించుకున్నామని తెలిపారు.

మైనారిటీ సోదరులు ఎన్నో సంవత్సరాలుగా కోరుకుంటున్న భవనాల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి రూ.45 కోట్లను మంజూరు చేశారని గుర్తు చేశారు. 45వ డివిజన్ నాయకులు సల్మాన్ షరీఫ్ ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిభిరం ను, కొత్తచెరువు రోడ్డులో మూడ నిధులతో రూ 35 కోట్ల నిర్మించిన సిసి రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం  నగరంలోని వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, టి పిసిసి అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సత్తూరు చంద్రకుమార్ గౌడ్,  జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వసంత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, ఎన్ పి వెంకటేష్, బెక్కరి మధుసూదన్ రెడ్డి, చలువగాలి రాఘవేందర్ రాజు, మారే పల్లి సురేందర్ రెడ్డి, సిజె బెనహర్, బురుజు సుధాకర్ రెడ్డి, అలీం, శాంతన్న యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇంచార్జీ గోనెల శ్రీనివాసులు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ అలి, నాయకులు ఐఎన్టీయుసి రాములు యాదవ్, మైత్రి యాదయ్య, తఖి, జహీర్, అక్బర్, ఫైసల్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.